Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌హ్మ‌ద్ కైఫ్ ట్వీట్‌ను కాపీ కొట్టిన రామ్ గోపాల్ వ‌ర్మ‌!

  • బంద్‌కి నిర్వ‌చ‌నం చెబుతూ ట్వీట్‌
  • కైఫ్ చేసిన 11 గంట‌ల త‌ర్వాత ఆర్జీవీ ట్వీట్‌
  • హేళ‌న చేస్తున్న నెటిజ‌న్లు
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవ‌ల ట్వీట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చీరాగానే ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ట్వీట్లు చేసిన ఆర్జీవీ, ఇవాళ బంద్‌కి నిర్వ‌చ‌నం చెబుతూ ఒక మామూలు ట్వీట్ చేశాడు. అయిన‌ప్ప‌టికీ అది చ‌ర్చ‌నీయాంశం కావ‌డం విశేషం. ఎందుకంటే, అదే ట్వీట్‌ను 11 గంట‌ల క్రితం మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ చేశాడు. ఇది గుర్తించిన నెటిజ‌న్లు ఆర్జీవీని హేళ‌న చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

'మీరు ట్విట్ట‌ర్‌లోకి వ‌చ్చింది కాపీ ట్వీట్లు పెట్ట‌డానికేనా?', 'మీ స్టైల్‌లో పెట్టండి సార్‌.. కాపీ వ‌ద్దు!', 'మీ సినిమాలు కాపీయే... ట్వీట్లు కూడా కాపీయేనా!' అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేశారు. అయితే తన ప్రతీ ట్వీట్‌ను చ‌ర్చ‌నీయాంశంగా మార్చే ఆర్జీవీ కావాల‌నే ఇలా కాపీ కొట్టి ట్వీట్ చేశాడేమోన‌న్న అనుమానాన్ని కూడా కొంత‌మంది నెటిజ‌న్లు వ్య‌క్త‌ప‌రిచారు. ఏది ఏమైనా... రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ రీ ఎంట్రీ మ‌ళ్లీ వివాదాస్ప‌ద చ‌ర్చ‌ల‌కు వేదిక‌గా మారింద‌నే చెప్పచ్చు.
 
ram gopal verma
tweet
kaif
discussion

More Telugu News